Header Banner

Police Shock to Jagan: వైఎస్ జగన్‌కు షాకిచ్చిన పోలీసులు..! అలా కుదరదని తేల్చి చెప్పారు, కండిషన్స్ అప్లై..!

  Tue Jun 17, 2025 16:52        Politics

ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు పోలీసులు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పర్యటనకు అనుమతి నిరాకరించారు. ఈ నెల 18న సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలు జిల్లా పోలీసుల్ని అనుమతి కోరారు.. అయితే భారీగా జనం వస్తే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని ఎస్పీ కంచి శ్రీనివాసరావు అంటున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు విధంగా అనుమతి ఇవ్వలేమని స్పష్టం చేశారు. కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో మాత్రమే రావాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఎస్పీ శ్రీనివాసరావు జగన్ పర్యటనకు అనుమతి నిరాకరించడానికి గల కారణాలను వివరించారు. ఈ నెల 18న వైఎస్ జగన్ సత్తెనపల్లి మండలం రెంటపాళ్లకు వస్తున్నారని, ఆయన పర్యటన కోసం సత్తెనపల్లి వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్ గజ్జల సుధీర్‌ భార్గవ్‌రెడ్డి అనుమతి కోరారన్నారు. అయితే, కార్యక్రమానికి ఎంత మంది వస్తున్నారు, ఎన్ని వాహనాలు వస్తున్నాయి, వారికి కావలసిన ఏర్పాట్లు ఏమిటి అనే పూర్తి వివరాలను గజ్జల సుధీర్‌ భార్గవ్‌రెడ్డి తమకు ఇవ్వలేదని ఎస్పీ చెప్పారు. సుమారు 30 వేల మంది వస్తారని తమకు తెలిసిందని.. అంత మంది ఒకేసారి వస్తే శాంతిభద్రతల సమస్య వస్తుందని.. అందుకే అనుమతి ఇవ్వలేదన్నారు.


ఇది కూడా చదవండి: ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! రూ.4,609 కోట్లతో, ఈ రూట్‌లోనే..


గతంలో జరిగిన కొన్ని సంఘటనలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తాము అడిగిన పత్రాలు ఇస్తే మరోసారి అనుమతిపై పరిశీలిస్తామని.. పోలీసుల అనుమతి తీసుకోకుండా ఈ కార్యక్రమం చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాము వైఎస్ జగన్ కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం కలిగించడం లేదని.. సెక్యూరిటీ కాన్వాయ్‌తో పాటు మరో మూడు వాహనాలు, వంద మంది విగ్రహావిష్కరణకు వస్తే తమకు అభ్యంతరం లేదన్నారు ఎస్పీ శ్రీనివాసరావు. వైఎస్సార్‌సీపీ నేతలు కోరిన విధంగా అనుమతి ఇవ్వలేమన్నారు.

వైఎస్సార్‌సీపీ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసే వీధి చాలా ఇరుకుగా ఉంటుందని.. అప్పుడు జనాలు భారీగా వస్తే బందోబస్తు రీత్యా ఇబ్బందులు ఎదురవుతాయన్నారు ఎస్పీ. ఒకవేళ ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేయాలనుకుంటే గ్రామ శివారులో నిర్వహించుకోవాలని సూచించామన్నారు. ఎటువంటి సమస్యలు తలెత్తకుండా, ప్రభుత్వ, ప్రజల ఆస్తులకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని లేఖ రాసి ఇస్తేనే అనుమతిస్తామన్నారు. ఇలాంటివి ఏమైనా ఉంటే వారం రోజుల ముందు అనుమతులు తీసుకోవాలని.. అప్పుడే సిబ్బందిని సిద్ధంగా ఉంచుతామన్నారు. ఇటీవల జరిగిన కొన్ని ఘటనల రీత్యా.. సాధ్యమైనంత వరకు పరిమిత సంఖ్యలోనే కార్యక్రమం నిర్వహించుకోవాలని సూచిస్తున్నాము అన్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ అనుమతి నిరాకరించడంపై వైఎస్సార్‌సీపీ స్పందించాల్సి ఉంది.. మరి ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటారా, పోలీసుల సూచనల ప్రకారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారా అన్నది చూడాలి.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 Annadaata sukibhava: రైతులకు బిగ్ రిలీఫ్! వారికి ఈ కేవైసీ అక్కర్లేదు.. స్టేటస్ చెక్ చేసుకోండి!

 

ఏపీ ప్రజలకు శుభవార్త! ఆసియాలోనే తొలిసారిగా మన విశాఖలోనే.. భారీ ప్రాజెక్టు!

 

నేడు విశాఖకు సీఎం చంద్రబాబు! కారణం అదే !

 

రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు! ఇక నుంచి ఇలా!

 

నో పోలీస్ వెరిఫికేషన్ 3 రోజుల్లో మీ ఇంటికే పాస్ పోర్ట్! పూర్తి వివరాలు ఇవే!

 

తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!

 

మేం ఇంకా బ్రతికే ఉన్నాం.. భయమేస్తుంది! మమ్మల్ని ఇండియాకు తీసుకెళ్లిపోండి!

 

కేవలం రూ.16కే లావా స్మార్ట్ వాచ్! ఆఫర్ ఎప్పటివరకంటే?

 

ఇంకో 6 రోజుల్లో రైతుల అకౌంట్లలోకి డబ్బులు! లిస్టులో మీ పేరు వస్తుందో లేదో చెక్ చేసుకోండిలా!

 

 తీవ్ర విషాదం! నదిలో కుప్పకూలిన వంతెన 25 మంది టూరిస్టులు గల్లంతు!

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!

 

ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!

 

మామిడి రైతులకు భరోసా.. మార్కెటింగ్ పై మంత్రి సమీక్ష! సీఎంతో ప్రతిపాదన హామీ!

 

నిరూపిస్తే రాజీనామా చేస్తా! జగన్‌కు ఏపీ మహిళా మంత్రి సవాల్ !

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #YSJaganShock #PoliceRejection #ConditionsApply #APPolitics #JaganNews #LawAndOrder #PoliticalSetback #BreakingNews